Business Idea: Rs.25,000 Investment - Income - Rs.50,000
Business Idea: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం.. సీజన్‌తో సంబంధమే లేదు ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చే వారితో పాటు వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వినూత్న మార్గాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.. దేశంలో కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటికొక బైక్ ఉండడం ఎంత కామన్‌గా ఉండేదో ఇప్పుడు కారు కూడా అంతే కామన్‌గా మారుతోంది. సెకండ్ హ్యాండ్ కారు అయినా సరే కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రభావత తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువైంది. కార్ల విక్రయాలు పెరగడంతో కారు వాషింగ సెంటర్లకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో కారు వాషిగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఈ వ్యాపాం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కార్ వాషింగ్ వ్యాపారాన్ని కనీసం రూ. 25 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీకు వచ్చే ఆదాయం ఆధారంగా పెట్టుబడి...